పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:03 AM
పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ క్రషర్ నగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పెద్దపల్లి జిల్లా, జులై 22 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ క్రషర్ నగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డీసీఎం వ్యాన్ ముందుగా నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News