Share News

కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి..

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:54 PM

ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు సామాన్యుడికి గుండెకోత మిగులుస్తున్నాయి. మొన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయల మధ్య ఉన్న ఉల్లిగడ్డ, ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 80 వరకు పలుకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది.

కోయకుండానే కంటతడి పెట్టిస్తున్న ఉల్లి..
Onion prices

  • కిలో రూ. 60 నుంచి 80 వరకు

  • మహారాష్ట్ర వర్షాలకు దెబ్బతిన్న పంట

  • రాయలసీమలో వర్షాలు లేక పండని పంట

పెద్దపల్లి: ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు సామాన్యుడికి గుండెకోత మిగులుస్తున్నాయి. మొన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయల మధ్య ఉన్న ఉల్లిగడ్డ, ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 80 వరకు పలుకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. కూరలో ఉల్లిగడ్డ వేయాలన్నా గృహిణులు భయపడే పరిస్థితి దాపురించింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలకు ప్రధానంగా మహారాష్ట్రలోని మన్మాడ్‌, లాసర్‌గఢ్‌, నాగపూర్‌ ప్రాంతాల నుంచి, మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్‌, అనంతపురం జిల్లాల నుంచి ఉల్లి సరఫరా అవుతుంది.


మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎకరాల కొద్దీ ఉల్లి పంట నీట మునిగి కుళ్లిపోయింది. అలాగే ఎల్‌నినో ప్రభావంతో కర్నూల్‌, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేకపోవడంతో పంట సాగు కాలేదు. భారీ వర్షాలు, వర్భాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు పడిపోవడంతో ఇక్కడ ధరల మంటకు ప్రధాన కారణమైంది. ఒకవైపు కొరత ఉంటే, మరోవైపు కొందరు వ్యాపారుల అక్రమ సంపాదన దాహం ప్రజలను మరింత లూటీ చేస్తోంది.


cc.jpgమార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులు సరుకును బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కావాలనే శీతల గిడ్డంగుల్లో ఉల్లిని నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి వేలం కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించి, రైతుబజార్లలో తక్కువ ధరకే ఉల్లిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆయనొక అక్షరాగ్ని

‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 01:54 PM