దులీప్ ట్రోఫీ ఫైనల్: తిలక్ వర్మ సెంచరీ మిస్.. ఈస్ట్ జోన్‌కు భారీ ఆధిక్యం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:40 PM
దులీప్ ట్రోఫీలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్-సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. నాలుగో రోజు సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్-సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. నాలుగో రోజు సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ(99) ఒక్క రన్ తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. ఛేదనలో సౌత్ జోన్ బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. దీంతో ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల ఆధిక్యం దక్కింది.
దేవదత్ పడిక్కల్(62), తిలక్ వర్మ(99) మినహా ఎవరూ రాణించలేకపోయారు. సీవీ మిలింద్(43), నారాయణ్ జనదీశన్(32) పర్వాలేదనిపించారు. ఈస్ట్ బౌలర్లు ముకేశ్ కుమార్ 3, షమి, కురేషి, శిఖర్ మోహన్ తలో 2 రెండు వికెట్లు తీశారు. అంతకుముందు ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్(270) డబుల్ సెంచరీ, కుమార్ కుషాగ్రా(101) సెంచరీలతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. భారీ ఆధిక్యమే ఉండటంతో ఈస్ట్ జోన్ జట్టు ఫాలో ఆన్ ఆడిస్తుందా? లేక వారే బ్యాటింగ్‌కు దిగుతారా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకు తెలుసంటూ..!
పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్