Share News

కోహ్లీ వన్8 బ్రాండ్ షూ ధరించిన పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:22 PM

పాకిస్థాన్ క్రికెటర్లు కూడా కోహ్లీ వన్8 షూ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ సారి పాక్ ప్లేయర్లు ధరించిన షూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

కోహ్లీ వన్8 బ్రాండ్ షూ ధరించిన పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో వైరల్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల విరాట్ ప్రారంభించిన వన్8 బ్రాండ్ షూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది. అయితే పాకిస్థాన్ క్రికెటర్లు కూడా కోహ్లీ వన్8 షూ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి ఉంటుంది. కానీ ఈ సారి పాక్ ప్లేయర్లు ధరించిన షూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.


మహిళల ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళా క్రికెటర్లు నష్రా సంధు, ఈమాన్ ఫాతిమా సహా పలువురు కోహ్లీ బ్రాండ్ వన్8 షూ ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత్‌కు చెందిన స్టార్ క్రికెటర్ కోహ్లీకి సంబంధించిన బ్రాండ్‌ను పాక్ క్రికెటర్లు ఉపయోగించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘అది సార్ మా కోహ్లీ బ్రాండ్‌కి ఉన్న క్రేజ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే హాంకాంగ్‌పై పాకిస్థాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకు తెలుసంటూ..!

పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్

Updated Date - Sep 09 , 2026 | 12:23 PM