రాత్రంతా గ్రామంలో నగ్నంగా దంపతుల సంచారం
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:01 PM
తమపై కరుప్పస్వామి ఆవహించినట్లు చెబుతున్న దంపతులు గత నాలుగురోజులుగా గ్రామమంతటా నగ్నంగా ఊరేగిన ఘటన తిరుపత్తూరు సమీపంలో జరిగింది.
చెన్నై: తమపై కరుప్పస్వామి ఆవహించినట్లు చెబుతున్న దంపతులు గత నాలుగురోజులుగా గ్రామమంతటా నగ్నంగా ఊరేగిన ఘటన తిరుపత్తూరు సమీపంలో జరిగింది. తిరుపత్తూరు జిల్లా కరంపూరు ఏరిక్కరై ప్రాంతంలో పళని, దీపా దంపతులు నివసిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ దంపతులు తమ ఇంట వింత పద్ధతిలో క్షుద్ర పూజలు జరిపారు.
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి తమపై కరుప్పసామి ఆవహించారని, ఇద్దరూ పూర్తి నగ్నంగా గ్రామమంతటా సంచరించారు. ఇలా నాలుగు రోజులపాటు ఆ దంపతులు నగ్నంగా గ్రామసంచారం చేశారు. కొంతమంది గ్రామపెద్దలు ఆ దంపతులను ప్రశ్నించగా, తమను అడ్డుకుంటే నాశనమవుతారని హెచ్చరించారు.
అంతటితో ఆగకుండా తమపై కరుప్పసామి ఆవహించి నగ్నంగా తిరుగుతున్నప్పుడు వీడియోలు తీసి సోషల్‌మీడియాలో వైరల్ చేయమంటూ పళని గ్రామస్థులకు తెలిపాడు. చివరకు ఆ దంపతుల ఆగడాలను భరించలేక గ్రామస్థులు నగ్నంగా పూనకం వచ్చినట్లు ఆడుతూ సంచరించిన వారిద్దరికి బట్టలు కట్టి తాళ్లతో బంధించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం
అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి బుల్‌డోజర్లు.
Read Latest AP News And Telangana News And International News And Telugu News