సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:39 PM
సూరత్‌లోని (గుజరాత్) సరోలీ ప్రాంతంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని పైఅంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం పెను కలకలానికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: సూరత్‌లోని (గుజరాత్) సరోలీ ప్రాంతంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని పైఅంతస్తుల్లో ఒక్కసారి మంటలు చెలరేగడం పెను కలకలానికి దారి తీసింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ స్పందించింది. 15 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సింది. ఆస్తినష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాలు కూడా ఇంకా తెలియరాలేదు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు ఐదు గంటలుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్‌లో భారీ స్థాయిలో వస్త్రాలను నిల్వ చేయడంతో ఆస్తినష్టం ఎక్కువగా ఉండవచ్చన్న భయాలు నెలకొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి
అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి బుల్‌డోజర్లు..
ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేశ్ మెహతా ఆత్మహత్య