Share News

వర్షాకాలం.. విద్యుత్‎తో భద్రం

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:39 PM

వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వర్షాకాలం.. విద్యుత్‎తో భద్రం
Monsoon electrical safety

  • చిన్న నిర్లక్ష్యం... పెద్ద ప్రమాదం

  • విద్యుత్‌ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి

గణేశ్‌నగర్‌(కరీంనగర్): వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్‌ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్‌ మన జీవితానికి వెలుగు నిచ్చే అమూల్యమైన శక్తి. అయినప్పటికీ చిన్న పాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. గృహ వినియోగదారులు, రైతులు, పశువుల కాపలాదారులు, విద్యార్థులు విద్యు త్‌ భద్రతా నియమాలను పాటించాలని విద్యుత్‌ అధి కారులు కోరుతున్నారు.


పాటించాల్సిన జాగ్రత్తలు..

  • వర్షం కురుస్తున్న సమయంలో తడిసిన విద్యుత్‌ స్తంభాలు, స్టే వైర్లు, సపోర్ట్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ పరికరాలు లేదా తడి గోడలకు ఆనుకుని ఉన్న విద్యుత్‌ ఉపకరణాలను తాకవద్దు.

  • తెగిపోయిన, వేలాడుతున్న లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలకు ఎట్టి పరిస్థితు ల్లోనూ దగ్గరగా వెళ్లవద్దు, తాకవద్దు.

  • ఉరుములు, మెరుపులు సంభవిస్తున్న సమయంలో చెట్ల కింద నిలబడకండి. బహిరంగ ప్రదేశాల్లో అవసరం లేకుండా సంచరించవద్దు.


vm1.jpg

  • తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు, మీటర్‌ బోర్డులు, మోటార్లు, గీజర్లు, కూలర్లు, వాటర్‌ హీటర్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను తాకవద్దు.

  • సెల్‌ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా ఫోన్‌ మాట్లాడ కండి. ముందుగా చార్జర్‌ను తొలగించిన తర్వాత మాత్రమే వినియోగించండి.

  • ఇంటి వైరింగ్‌కు తప్పనిసరిగా నాణ్యమైన ఎర్తింగ్‌ చేయించండి.

  • పాడైన, జాయింట్లు ఉన్న, ఇన్సులేషన్‌ దెబ్బతిన్న వైర్లు వెంటనే మార్చండి.


  • బట్టలు ఆరబెట్టేటప్పుడు ఇనుప దండెలకు బదులుగా ప్లాస్టిక్‌ దండెలు ఉపయోగించండి.

  • విద్యుత్‌ సర్వీస్‌ వైర్లు, మీటర్‌ బోర్డులు లేదా విద్యుత్‌లైన్ల సమీపంలో తడి బట్టలు ఆరబెట్టవద్దు.

  • ఇంటి ముందు ఏర్పాటు చేసే రేకులు, ఇనుప నిర్మాణాలు విద్యుత్‌ వైర్లను తాకకుండా తగిన దూరంలో ఉండేలా చూసుకోండి.

  • పిల్లలను విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ ఫార్మర్లు, మీటర్‌ బోర్డులు, స్విచ్‌ బోర్డుల వద్ద ఆడనివ్వకండి.

  • ఏదైనా విద్యుత్‌ ప్రమాదం లేదా లోపం గమనించిన వెంటనే టీజీఎన్‌పీడీసీఎల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు సమాచారం ఇవ్వండి.


vm2.jpgరైతులకు ప్రత్యేక సూచనలు...

  • వ్యవసాయ మోటార్‌ను ఆన్‌ చేసే ముందు స్టార్టర్‌, వైర్లు, స్విచ్‌లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలించండి.

  • విద్యుత్‌ మోటార్లు, పైపులు, ఫుట్‌ వాల్వులు లేదా తడి పరిస్థితుల్లో ఉన్న పరికరాలనుతాకవద్దు.

  • మోటార్ల మరమ్మతులు అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తో మాత్రమే చేయించండి.

  • ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడిపేటప్పుడు విద్యుత్‌ లైన్లకు తగలకుండా చూసుకోండి.


సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం..

  • టీజీఎన్‌పీడీసీసీఎల్‌ ఎస్‌ఈ ఆర్‌ రవీందర్‌

వర్షం కురుస్తున్న సమయంలో తడిసిన విద్యుత్‌ స్తంభాలు, స్టే వైర్లు, సపోర్ట్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ పరికరాలు లేదా తడి గోడ లకు ఆనుకుని ఉన్న విద్యుత్‌ ఉప కరణాలకు దురంగా ఉండాలి. ప్రతి వినియోగదారు విద్యుత్‌ భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు. చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమా దానికి దారితీస్తుంది. విద్యుత్‌ భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి. వినియోగదారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు విద్యుత్‌ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 12:39 PM