ట్రేడింగ్ పేరుతో మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.33 లక్షల టోకరా
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:42 AM
అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించి ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.33 లక్షల మేర పెట్టుబడి పెట్టించారు నిందితులు.
సంగారెడ్డి జిల్లా, జులై 31: అధిక లాభాల ఆశ చూపి రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కొట్టేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించి ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.33 లక్షల మేర పెట్టుబడి పెట్టించారు నిందితులు. అపెక్స్ డిజిటల్ క్యాపిటల్ పేరుతో వాట్సాప్ గ్రూపులో రిటైర్డ్ ఉద్యోగిని చేర్చారు. ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టాలంటూ ప్రలోభాలు పెట్టారు. వారి మాయ మాటలు నమ్మిన బాధితుడు.. కేటుగాళ్లు పంపిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆపై పలు దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.33 లక్షల నగదును బదిలీ చేశారు.
అంతటితో ఆగని నిందితులు.. ఐపీఓ పెట్టుబడి పేరుతో మరింత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన బాధితుడు.. ఇప్పటి వరకు పెట్టిన డబ్బును విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన రిటైర్డ్ ఉద్యోగి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అధిక లాభాల ఆశచూసి పెట్టుబడులు పెట్టొద్దని, ఇలాంటి వ్యవహారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
సూట్‌కేస్‌లో యువతి మృతదేహం.. నిందితుడి అరెస్ట్
లక్ష్యాలను నెరవేర్చకపోతే కఠిన చర్యలు తప్పవు.. ఆయిల్ పామ్ కంపెనీలకు తుమ్మల ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News