Share News

లక్ష్యాలను నెరవేర్చకపోతే కఠిన చర్యలు తప్పవు.. ఆయిల్ పామ్ కంపెనీలకు తుమ్మల ఆదేశాలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:27 AM

ఆయిల్ పామ్ కంపెనీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై కీలకంగా చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల లక్షాలు, మిల్లుల నిర్మాణ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

 లక్ష్యాలను నెరవేర్చకపోతే కఠిన చర్యలు తప్పవు.. ఆయిల్ పామ్ కంపెనీలకు తుమ్మల ఆదేశాలు
Thummala Nageswara Rao

హైదరాబాద్, జులై 31: ఆయిల్ పామ్ కంపెనీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై కీలకంగా చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల లక్షాలు, మిల్లుల నిర్మాణ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కంపెనీల లక్ష్యాల సాధనపై మంత్రి ఆరా తీశారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనులపై సమీక్షించారు.


మిల్లుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ లక్ష్యాలను ఆయిల్ పామ్ కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. లక్ష్యాలు నెరవేర్చని కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం.. నిందితుడి అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 11:27 AM