Share News

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:56 AM

విశాఖపట్నంలోని లంకెలపాలెం నుంచి అగనంపూడి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి
Visakhapatnam News

విశాఖపట్నం, జులై 31: నగరంలోని లంకెలపాలెం నుంచి అగనంపూడి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి తరలించారు. మృతుడు సాయిగా గుర్తించారు.


గాయపడిన బాలు అనే వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిద్దరూ అగనంపూడి గల్లవానిపాలెం ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి...

అడ్డుపడటం.. ఆపడం.. ఔను.. అంతా జగనే చేశారు!

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 09:59 AM