Share News

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:22 AM

వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి..  నేడు అంత్యక్రియలు
YS Ananda Reddy Death

కడప, జులై 31 (ఆంధ్రజ్యోతి): వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనందరెడ్డి(85) (YS Ananda Reddy Death) అనారోగ్యంతో మృతిచెందారు. హైదరాబాద్‌ నివాసంలో ఆనందరెడ్డి గత కొంతకాలంగా ఉంటున్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి సోదరుడే ఆనందరెడ్డి. పులివెందులలో చికిత్స పొందుతూ ఆనందరెడ్డి మృతిచెందారు. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం పులివెందులలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆనందరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరుకానున్నారు. ఆయన మృతిపై పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆనందరెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 09:50 AM