చోరీకి ముందు దేవుళ్లకు క్షమాపణ.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:16 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా మల్‌ధక్కా ప్రాంతంలో ఉన్న శీతల మాత ఆలయం, శివాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. రాత్రి వేళ ఇద్దరు దొంగలు రెండు ఆలయాల్లోకి చొరబడి హుండీలను పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు.
మహారాష్ట్ర, జులై 31: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా మల్‌ధక్కా ప్రాంతంలో ఉన్న శీతల మాత ఆలయం, శివాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. రాత్రి వేళ ఇద్దరు దొంగలు రెండు ఆలయాల్లోకి చొరబడి హుండీలను పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. అయితే ఈ ఘటనలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చోరీకి పాల్పడే ముందు దొంగల్లో ఒకరు.. ఆలయంలోని దేవుళ్లకు నమస్కరించి, చేతులు జోడించి క్షమాపణ కోరి.. అనంతరం హుండీని పగులగొట్టి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలయాల్లో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆలయాల్లో పరిస్థితిని పరిశీలించారు. హుండీ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి
Read Latest National News And Telugu News