Share News

కన్నబిడ్డపైనే కత్తిపోటు!

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:21 AM

‘నా కూతుర్ని కష్టపడి చదివించాను. ఇప్పుడు మీరొచ్చి పెళ్లి చేసుకుని తీసుకుపోతే నా గతేంటి..? నాకు రూ.40 లక్షలివ్వండి. నా కూతురి నెల జీతం కూడా నాకే ఇవ్వాలి. అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటా..’ అని వరుడి కుటుంబానికి తండ్రి షరతు పెట్టాడు. దీన్ని సొంత కూతుళ్లే వ్యతిరేకించారు.

కన్నబిడ్డపైనే కత్తిపోటు!
Father Attacks Daughter

  • కళాశాలలోనే కూతురిని పొడిచిన తండ్రి

  • కష్టపడి చదివించా.. పెళ్లి తర్వాతా జీతం నాకే

  • వరుడి కుటుంబానికి వధువు తండ్రి షరతులు

  • వ్యతిరేకించిన కుటుంబం.. కోపంతో దాడికి దిగిన తండ్రి

  • బెంగళూరులో సంఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..

బెంగళూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘నా కూతుర్ని కష్టపడి చదివించాను. ఇప్పుడు మీరొచ్చి పెళ్లి చేసుకుని తీసుకుపోతే నా గతేంటి..? నాకు రూ.40 లక్షలివ్వండి. నా కూతురి నెల జీతం కూడా నాకే ఇవ్వాలి. అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటా..’ అని వరుడి కుటుంబానికి తండ్రి షరతు పెట్టాడు. దీన్ని సొంత కూతుళ్లే వ్యతిరేకించారు. ఆగ్రహానికి లోనైన తండ్రి, పెళ్లి కావాల్సిన కూతురిని కత్తితో పొడిచాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహళ్ళి సమీపంలో విజయపురలో ఉంటున్న నాగేంద్రకు నలుగురు కూతుళ్లు. రెండో కూతురు లక్ష్మీదుర్గ రాజనకుంటె ఎస్‌ఐవీటీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు నెల కిందట ఓ సంబంధం కుదిరింది. వరుడి కుటుంబానికి నాగేంద్ర కొన్ని షరతులు పెట్టారు. తన కూతురిని చదివించడానికి రూ.లక్షలు తెలిపారు.


తనకు రూ.40లక్షల నగదు ఇవ్వాలని, కూతురి జీతం తానే తీసుకుంటానని ప్రతిపాదించారు. దీనికి ఒప్పుకుంటేనే తన కూతుర్నిస్తానని, లేదంటే లేదని తెగేసిచెప్పేశారు. ఈ విషయంలో నాగేంద్రకు సొంతకుటుంబ సభ్యులనుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. పెళ్లి చేసుకునేవారికి ఎవరైనా ఇలాంటి ఆంక్షలు పెడతారా అని మందలించారు. కూతుళ్లందరూ తిరగబడటంతో నాగేంద్ర తీవ్రఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో విజయపుర నుంచి రోజూ రాజ నకుంటెలోని కళాశాలకు వెళ్లడం ఇబ్బందికరమని భావించిన లక్ష్మీదుర్గ, బాగలూరులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడే ఉంటున్నారు. కూతురు ఇంటికి రాకపోవడంతో 25న నాగేంద్ర నేరుగా కళాశాలకు వెళ్లారు. ల్యాబ్‌లో ఉన్న కూతురిపై కత్తితో దాడి చేశారు. విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజనుకుంటె పోలీసులు, నాగేంద్రను అరెస్టు చేశారు. లక్ష్మీదుర్గ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 08:21 AM