దొంగ ఎలుక!
ABN , Publish Date - Jul 31 , 2026 | 06:56 AM
షట్టర్ తెరవలేదు.. తాళాలు పగులగొట్టలేదు.. కానీ తుమకూరులోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది! ఏకంగా రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయమయ్యాయి.
బంగారం దుకాణంలో రూ.10 లక్షల ఆభరణాలు చోరీ
సీసీ ఫుటేజీతో గుర్తింపు..
కలుగులోంచి ఆభరణాలు వెలికితీత
కర్ణాటకలో ఆసక్తికర సంఘటన
బెంగళూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): షట్టర్ తెరవలేదు.. తాళాలు పగులగొట్టలేదు.. కానీ తుమకూరులోని ఓ బంగారం దుకాణంలో చోరీ జరిగింది! ఏకంగా రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయమయ్యాయి. దొంగతనం ఎలా జరిగిందో దుకాణ యజమానికి, సిబ్బందికి అర్థంకాలేదు. దొంగను గుర్తించేందుకు దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో కనిపించిన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో దుకాణంలోకి ఓ ఎలుక చొరబడింది. విడతలవారీగా వజ్రాలు పొదిగిన 10 బంగారం ఉంగరాలను, మూడు చైన్‌లను ఎత్తుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ ఎలుక అదే దుకాణంలో బొరియను పెట్టుకుని, అందులోకి ఆభరణాలను తీసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే ఎలుక కలుగును తవ్వి.. అందులో ఉన్న ఆభరణాలను బయటకు తీశారు. ఆభరణాలు దొరికాయి కాపీ, ఆ కలుగులో దొంగమాత్రం కనిపించలేదు. కలుగును పూర్తిగా మూసివేశారు.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News