సింగరేణిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది: కేటీఆర్
ABN , Publish Date - Oct 14 , 2026 | 09:16 PM
సింగరేణిని ప్రైవేట్పరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 14: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘సింగరేణి కార్మిక గర్జన’ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు.
సింగరేణిపై తుపాకి పెట్టి.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సాగును నాశనం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిపై నిందలు వేస్తోందన్నారు. కరెంట్ కష్టాలకు బొగ్గు లేకపోవడమే కారణమని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పవర్ ప్లాంట్స్కు సింగరేణి బొగ్గు ఇవ్వడం లేదని బద్నాం చేస్తోందని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం సింగరేణికి రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఆయన వెల్లడించారు. అందుకే సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు.
‘పోరాటాల పురిటిగడ్డ రామగుండం. తెలంగాణ వచ్చిన రోజు రాష్ట్రం చుట్టూ చీకట్లే. అలాంటి నేపథ్యంలో సింగరేణి సాయంతో కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ.. కాంగ్రెస్కు ఓటు వేసినందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. కేసీఆర్ మాటలను ప్రజలు పెడచెవిన పెట్టారు. కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది’ అంటూ కేటీఆర్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో