Share News

శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:49 PM

కార్తీక మాస ప్రారంభంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. మార్కె ట్‌లో వివాహ అనుబంధ వ్యాపార దుకాణాల్లో రద్దీ పెరి గింది. బంగారం ధరలు కాస్త తగ్గినా ఫంక్షన్‌ హాళ్లు మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు పెరిగాయి.

శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు
Karthika Masam Weddings

  • జిల్లాలో పెళ్లిళ్ల సందడి

  • ప్రారంభమైన కార్తీక మాసం..

  • వివాహాలకు ముహూర్తాలు

  • దిగి వచ్చిన బంగారం ధరలు

జగిత్యాల: కార్తీక మాస ప్రారంభంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. మార్కె ట్‌లో వివాహ అనుబంధ వ్యాపార దుకాణాల్లో రద్దీ పెరి గింది. బంగారం ధరలు కాస్త తగ్గినా ఫంక్షన్‌ హాళ్లు మొదలుకొని నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు పెరిగాయి. నెలరోజుల నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు 10గ్రాములకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు తగ్గినట్లు మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారు పెళ్లి చేయాలంటే తలకు మించిన భారంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలుప్రాంతాల్లో మూడు ముళ్లతో వందల సంఖ్యలో నవ జంటలు ఒక్కటి కానున్నాయి. యువతీ యువకుల తల్లిదండ్రులు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా లయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో అధిక సంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి.


  • ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్‌ ముందస్తు బుకింగ్‌లు...

జిల్లావ్యాప్తంగా వందలసంఖ్యలో పెళ్లిళ్లు జరగనుం డడంతో తల్లిదండ్రులు ముందస్తు పనులపై దృష్టి సారిం చారు. ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్‌, పురోహితులు, భాజా భజంత్రీలు, ఆర్కెస్ట్రా, డెకరేషన్‌, ఫొటోగ్రాఫీ, వీడి యోగ్ర ఫీ, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టుడియోలు ఇలా పెళ్లికి అవసర మైన వాటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై దృష్టి సారించారు. వివాహాలకు అవసరమైన పట్టు వస్త్రా లు, దుస్తులు, బంగారు ఆభరణాలు ముందస్తు కొనుగోలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సుమారు 150వరకు ఫంక్షన్‌ హాళ్లు, 300వరకు కమ్యూనిటీ హాళ్లు, పదులసంఖ్యల్లో దేవాలయాల్లో పెళ్లిమండ పాలున్నాయి. వీటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై వివాహాల నిర్వాహకులు దృష్టి సారించారు.


jgl1.2.jpg

  • ఊపందుకోనున్న వ్యాపారాలు..

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమవడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలల్లో పలు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, బట్టల దుకాణాలు, డ్రెస్సెస్‌, జ్యూవెల్లరీ దుకాణాలు, ఫంక్షన్‌ హాల్స్‌, క్యాటరింగ్‌ కేంద్రాలు, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వంట మాస్టర్స్‌ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌ పల్లిలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దేశంలో వివిధప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యాపారులు తీసుకువచ్చి తమ దుకా ణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వినియోగదా రులను ఆకర్శించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహు మతులను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహాల సీజన్‌లో జిల్లా మొత్తంగా రోజుకు రూ. కోటి నుంచి రూ. మూడు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతా యని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.


  • శుభ ముహూర్తాలు..

కార్తీకమాసం, మార్గశిరమాసంలో (నవంబరు, డిసెంబరు) రెండునెలలు వివాహాది ముహూర్తాలు న్నాయని పురోహితులు చెబుతున్నారు. నవంబరులో 12వతేదీ నుంచి 15వతేదీ వరకు, 18నుంచి 22 వరకు, 24వతేదీ నుంచి 26వతేదీ వరకు ముహూర్తాలున్నాయంటున్నారు. డిసెంబరులో 2నుంచి 4వ తేదీ వరకు, 10నుంచి 13 వరకు, 15నుంచి 19వరకు, 22వ, 23వ తేదీల్లో, 27నుంచి 31వ తేదీ వరకు వివాహాది శుభకార్యాలు ఉన్నట్లు పురోహితులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అధిక ధరలకు బియ్యం విక్రయాలు

అర్హులకు ‘చేయూత’.. కొత్త పింఛన్ల మంజూరుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 12:49 PM