హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానంటావా.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:01 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై.. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....? కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని ధ్వజమెత్తారు.
పెద్దపల్లి, జూన్7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై(CM Revanth Reddy).. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....?, కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) పెద్దపల్లి జిల్లాలో హరీశ్‌రావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలను ఊచకోత కోసిన హిట్లర్ లాగే.. రేవంత్‌రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు.
హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకూ పడుతుందని హరీశ్‌రావు ఆగ్రహించారు. హిట్లర్‌ను తరిమినట్లే.. ప్రజలు రేవంత్‌రెడ్డిని కూడా తరుముతారని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పాపాలకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెబుతూనే ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు, భూమికి గౌరవం లేదని చెప్పుకొచ్చారు. రైతులు ఓటేయకపోతే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News