పండగ పూట ధరల మంట
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:43 PM
ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసరాల ధరలు పేద, మధ్య తరగతి వారిని హడలెతిస్తున్నాయి.
వంటింటి బడ్జెట్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్
సన్నబియ్యం ధరలకు రెక్కలు
క్వింటాల్‌కు రూ.1,500లకు పైగా పెరుగుదల
పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు
బెజ్జూరు(కరీంనగర్): ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసరాల ధరలు పేద, మధ్య తరగతి వారిని హడలెతిస్తున్నాయి. నాలుగు నెలల కిందటి వరకు అందుబాటులో ఉన్న సరు కులు ఇప్పుడు చుక్కలు తాకుతుండడంతో ప్రతి నెలా ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు దాదాపు రెట్టింపయ్యా యి. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి అంతం తమాత్రంగానే ఉండడం, డిమాండ్ మేరకు సరకు లు రాకపోవడంతో వ్యాపారులు సైతం సంక్షోభ పరి స్థితులు ఎదుర్కొంటున్నారు.
కూరగాయలు మొదలు కొని నూనెలు, పప్పుల ధరలు ఆకాశన్నంటడంతో పండుగలు ఎలా చేసుకు నేదని సామాన్య జనం వాపోతున్నారు. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో మార్కెట్లో ధరలు హడలెత్తిస్తున్నాయి. వంటింటి సరకుల ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటం పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు ముఖం చాటేయడంతో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం అన్ని రకాల వస్తువుల పై పడటం, రాబోయే రోజుల్లో పరిస్థితి ఏ మేరకు ఉంటుందోనని ఇప్పటి నుంచే ఆందోళన మొదలవుతోంది
నెల రోజుల వ్యవధిలో..
నెల రోజుల వ్యవధిలో సన్నబియ్యం ధరలు విపరీ తంగా పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు రూ.1,500లకు పైగా పెరిగాయి. ఎల్‌నినో కారణంగా ఈ ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసిన తొలినాళ్లలో సన్నబియ్యం ధరలు దిగివ చ్చాయి. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతు న్నా యి. వర్షాలు తక్కువగా కురవడం, ఎల్‌నినో కారణం గా భిన్నమైన వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. దానితో పాటు రేషన్ బియ్యాన్ని చాలా మంది తిన డం లేదు. దీంతో నాణ్యమైన సన్నబియ్యానికి డిమాండ్ ఏర్పడింది.
నెల రోజులకు ముందు హెచ్ఎంటీ బియ్యం ధర క్వింటాల్‌కు రూ. 6,000-6, 300గా ఉండేది. జైశ్రీరాం బియ్యం ధర క్వింటాల్‌కు రూ.6, 800-7,000లుగా పలికింది. ఇప్పుడు హెచ్ ఎంటీ ధర రూ.7,600- 7,800కు చేరింది. అదే జైశ్రీరాం క్వింటాల్ ధర రూ. 8,400-8,600లకు పెరి గింది. సాంబమసూరి ధర క్వింటాల్‌కు గతంలో రూ. 5,000 ఉండగా ప్రస్తుతం రూ.7,000లకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు కూడా ప్రస్తుత సమయానికేనని విక్రయదారులు చెబుతు న్నారు. త్వరలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
నియంత్రణపై దృష్టి పెడితే..
బియ్యం ధరలపై ప్రభుత్వంతో పాటు ధరల నియంత్రణ కమిటీలు కూడా కీలకంగా పని చేయా ల్సి ఉంటుంది. కేవలం 50రోజుల్లోనే ధరలు ఈ విధంగా పెరిగిపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే అదనుగా భావిం చిన వ్యాపారులు సన్న బియ్యాన్ని రహస్యంగా నిల్వ చేసుకొని అధిక ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ధరలను నియంత్రించి సామాన్య జనంపై భారం పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కూరగాయలు మొదలుకొని..
కూరగాయలు మొదలుకొని పప్పుధాన్యాలు, నూనె ల ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతోంది. కూరగాయలు ఏ రకమైన కిలోకు రూ.80కి పైగా పలుకుతోంది. వారానికి సరిపడా కొంటే రూ.500లకు పైగా ఖర్చువుతోందని ప్రజలు వాపోతు న్నారు. అల్లం, ఉల్లి, వెల్లుల్లి ఇలా వంటింట్లో విని యోగించే ధరలు ఒక్కసారిగా పెరగడం సామా న్యులకు భారంగా మారింది.
కిలో చిక్కుడుకాయ ధర రూ. 160, మెంతికూర రూ.200, బీర రూ.50, పచ్చి మిర్చి రూ.120, సిమ్లా మిర్చి రూ.100, బెండకాయ రూ.80, గోబి రూ.80, టమాట రూ.50, ఉల్లి రూ.80, వెల్లుల్లి రూ.200 పలుకు తోంది. దీంతో వచ్చే దసరా దీపావళి పండుగలు ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదని పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. ఇక పప్పు ధరల విషయానికొస్తే గతంలో కందిపప్పు 140ఉండగా, ప్రస్తుతం 160పలుకు తోంది. పెసర పప్పు100-120, శనగపప్పు 80-100, చక్కెర ధర 55-60లు పెరగడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సగం మంది వెన్నునొప్పి బాధితులే..!
బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News