Share News

దుబాయ్‌లో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్.. షారుక్ ఖాన్‌తో స్పెషల్ కనెక్షన్!

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:04 PM

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా దుబాయ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన నివాసాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

దుబాయ్‌లో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్.. షారుక్ ఖాన్‌తో స్పెషల్ కనెక్షన్!
Suryakumar Yadav Dubai house

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా దుబాయ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన నివాసాన్ని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ పేరుతో రూపొందిస్తున్న ఓ విలాసవంతమైన నివాస ప్రాజెక్టులో ఈ ఇల్లు ఉండటంతో ఈ కొనుగోలు మరింత ఆసక్తికరంగా మారింది (Suryakumar Yadav Dubai house).


సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి కొత్త ఇంటికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దుబాయ్‌లోని డాన్యూబ్ ప్రాపర్టీస్ సంస్థ నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దుబాయ్‌తో తనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని సూర్య తెలిపాడు. 2014లో ఐపీఎల్ ఆడేందుకు తొలిసారి దుబాయ్‌కు వచ్చానని, 2020లో మరోసారి అక్కడికి వెళ్లానని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నగర జీవనశైలి, విలాసవంతమైన సౌకర్యాలు, భద్రత తనను ఆకట్టుకున్నాయని వివరించాడు (Suryakumar Yadav property).


భారత్‌లోనూ భద్రతకు కొదవ లేదని, అయితే దుబాయ్‌లో జీవన ప్రమాణాలు, సౌకర్యాలు ప్రత్యేకంగా అనిపిస్తాయని పేర్కొన్నాడు. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ సంతోషంగా, సౌకర్యంగా ఉంటుందని తెలిపాడు. కాగా, డాన్యూబ్ గ్రూప్ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పేరుతో 'షారుఖ్‌జ్ రెసిడెన్సెస్' అనే విలాసవంతమైన నివాస ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులోనే నివాసం కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని సూర్య తెలిపాడు. తన కొత్త నివాసంలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి సూర్యకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు (Sharukhz Residences).


ఈ ప్రాజెక్టులో 40కి పైగా ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయని సూర్య తెలిపాడు (Dubai luxury homes). వాటిలో తనను అత్యంత ఆకట్టుకున్నది 'లాంజివిటీ లాంజ్' అని చెప్పాడు. ఆరోగ్య సంరక్షణ, శారీరక శ్రేయస్సు, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించే ఇలాంటి ప్రత్యేక సౌకర్యాలు సాధారణ నివాస ప్రాజెక్టుల్లో అరుదుగా కనిపిస్తాయని సూర్య అభిప్రాయపడ్డాడు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ నివాసంలో ఆధునిక సౌకర్యాలతో పాటు దుబాయ్ నగర అందాలను ఆస్వాదించే అవకాశం కూడా ఉంటుందని తెలిపాడు.


ఇవి కూడా చదవండి..

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..


పసిడి ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 16 , 2026 | 01:06 PM