Share News

ఇక సహించేది లేదు.. రష్యా చమురు శుద్ధి కేంద్రంపై ఉక్రెయిన్ దాడి..

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:35 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇంధన కాల్పుల విరమణకు స్వస్తి చెబుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.

ఇక సహించేది లేదు.. రష్యా చమురు శుద్ధి కేంద్రంపై ఉక్రెయిన్ దాడి..
Volodymyr Zelensky, Ukraine drone strike

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇంధన కాల్పుల విరమణకు స్వస్తి చెబుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) ప్రకటించారు. రష్యా తమ దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తుండటంతో, ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రష్యాలోని ర్యాజాన్ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది (Russian oil refinery attack).


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని, తాను మోసపోయినట్లు భావిస్తున్నానని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఇంధన కేంద్రాలపై దాడులను నిలిపివేసే పరిమితి ఇక ముగిసిందని 'ఫైనాన్షియల్ టైమ్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ అన్నారు. రష్యా దాడులు ఆపకుండా ఉక్రెయిన్ మాత్రమే సంయమనం పాటించడం సాధ్యం కాదన్నారు. కాగా, మాస్కోకు ఆగ్నేయంగా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ర్యాజాన్ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది (Ukraine Russia war).


మరోవైపు, అమెరికా, రష్యా మధ్య కుదిరిన డీజిల్ సరఫరా ఒప్పందం ఉక్రెయిన్ అసంతృప్తికి ముఖ్య కారణంగా నిలిచింది (US Russia diesel deal). రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే ఒప్పందం వల్ల ఆ దేశానికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా యుద్ధాన్ని కొనసాగించేందుకు పుతిన్ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు లభిస్తాయని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఇంటర్వ్యూలో 'ట్రంప్ మిమ్మల్ని మోసం చేసినట్లు భావిస్తున్నారా' అని అడిగినప్పుడు జెలెన్‌స్కీ 'అవును' అని సమాధానమిచ్చారు. రష్యా వైపు ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు అనిపించడం బాధ కలిగిస్తోందని, అమెరికా తటస్థంగా వ్యవహరిస్తే తమకు అభ్యంతరం లేదని జెలెన్‌స్కీ వివరించారు.


ఇవి కూడా చదవండి..

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..


పసిడి ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 16 , 2026 | 11:41 AM