Share News

వాళ్లంతా నీ స్నేహితులే కదా.. రాహుల్ గాంధీకి ఖర్గే చురకలు..

ABN , Publish Date - Oct 16 , 2026 | 10:30 AM

కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే సరదాగా స్పందించారు.

వాళ్లంతా నీ స్నేహితులే కదా.. రాహుల్ గాంధీకి ఖర్గే చురకలు..
Rahul Gandhi, Mallikarjun Kharge

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే సరదాగా స్పందించారు. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గులాం నబీ ఆజాద్ వంటి నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన ఆ నేతలంతా ఒకప్పుడు రాహుల్ గాంధీకి స్నేహితులేనని గుర్తుచేస్తూ ఖర్గే చమత్కరించారు (Rahul Gandhi, Mallikarjun Kharge).


యువజన కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ)కు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలతో రాహుల్ గాంధీ గురువారం సమావేశమయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో యువ కార్యకర్తలతో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడిన నాయకుల గురించి మాట్లాడుతూ.. పిరికివాళ్లు, స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టారని, ఇప్పుడు పార్టీలో మిగిలింది సింహాలేనని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా జ్యోతిరాదిత్య సింధియా, గులాం నబీ ఆజాద్ పేర్లను ప్రస్తావించారు (Rahul Gandhi remarks).


రాహుల్ వ్యాఖ్యలపై ఖర్గే సరదాగా స్పందించారు. పార్టీని వీడిన నాయకులంతా గతంలో రాహుల్ గాంధీ స్నేహితులేనని వ్యాఖ్యానించారు (Political friendship). దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఖర్గే వ్యాఖ్యకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. సింధియా తన స్నేహితుడు కాదని అన్నారు. రాజకీయాల్లో పైకి స్నేహితులుగా కనిపించే వారు నిజమైన స్నేహితులు కాకపోవచ్చని, శత్రువులుగా కనిపించే వారు కూడా నిజమైన శత్రువులు కాకపోవచ్చని రాహుల్ వ్యాఖ్యానించారు. రాజకీయ సంబంధాలను అంచనా వేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..


పసిడి ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 16 , 2026 | 11:27 AM