Share News

యూదులను కాల్చి చంపాలనుంది.. హమాస్ మాజీ చీఫ్ కుమారుడి లేఖ..

ABN , Publish Date - Oct 16 , 2026 | 09:41 AM

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు సంబంధించిన మరో సంచలన తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వార్ పదేళ్ల కుమారుడు ఇబ్రహీం తన తండ్రికి రాసిన ఓ లేఖను తాజాగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.

యూదులను కాల్చి చంపాలనుంది.. హమాస్ మాజీ చీఫ్ కుమారుడి లేఖ..
Yahya Sinwar son letter

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు సంబంధించిన మరో సంచలన తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ మాజీ అధినేత యాహ్యా సిన్వార్ పదేళ్ల కుమారుడు ఇబ్రహీం తన తండ్రికి రాసిన ఓ లేఖను తాజాగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. అందులో యూదులను కాల్చాలనే కోరికను బాలుడు వ్యక్తం చేసినట్లు సైన్యం వెల్లడించింది. ఈ లేఖతో పాటు ఆయుధాలు, ట్యాంకులు, క్షిపణులకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయని తెలిపింది (Yahya Sinwar son letter).


ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. గాజా యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇబ్రహీం ఈ లేఖ రాశాడు. అప్పటికి అతడి వయసు పదేళ్లు. తన తండ్రిని చూడాలని, ఆయనను కౌగిలించుకోవాలని ఉందని లేఖలో పేర్కొన్నాడు. అదే సమయంలో, తుపాకీని చేతబట్టి యూదులను కాల్చాలనే కోరికను కూడా అతడు వ్యక్తం చేశాడు. కాగితం, అట్టముక్కలతో తుపాకులు, ట్యాంకులు, కలష్నికోవ్ తుపాకుల నమూనాలను తయారు చేస్తున్నట్లు రాశాడు. యుద్ధం ముగిసి తన తండ్రి క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నాడు (Israel Hamas conflict).


గాజా ప్రాంతంలో సైనిక చర్యలు నిర్వహిస్తున్న సమయంలో 2024లో ఈ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి (Anti-Jewish hatred). యాహ్యా సిన్వార్ మరణించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 2026 అక్టోబర్ 15న ఈ లేఖను బహిరంగంగా విడుదల చేశాయి. లేఖకు జతగా ఉన్న చిత్రాల్లో ఆయుధాలు, ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలో ట్యాంకులు, ఇజ్రాయెల్ వైపు ప్రయోగిస్తున్న క్షిపణుల బొమ్మలు ఉన్నాయని సైన్యం పేర్కొంది. హమాస్ భావజాలం పిల్లల పెంపకంపై చూపుతున్న ప్రభావం గురించి ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి..

రష్యాతో ట్రంప్ ఆయిల్ డీల్.. ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..


పసిడి ధరలు మళ్లీ కిందకే.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 16 , 2026 | 09:43 AM