Share News

హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:50 PM

ఖైరతాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న మనవడు గాయపడ్డాడు.

హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి
Hyderabad Lift Accident

హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్‌మెంట్స్‌లో లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న మనవడు గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ ఆనంద్ నగర్ కాలనీలోని భావన అపార్ట్‌మెంట్స్ (హౌస్ నంబర్: 6-3-627/ఎ)లో లిఫ్ట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాధ (58) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో జరిగింది. లిఫ్ట్ పూర్తిగా ఆ అంతస్తుకు చేరుకోకముందే బాధితురాలు తలుపు తెరిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా లిఫ్ట్ గుంతలో పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెతో పాటు ఉన్న 13 నెలల మనవడు జియోల్ గాయపడటంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన అనంతరం అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 05:57 PM