Share News

హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమోన్మాది కత్తిదాడిలో యువతి మృతి

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:50 AM

హైదరాబాద్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుగూడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి అంజలి మృతిచెందింది. ఆమెపై ప్రియుడు అశ్విన్ కత్తితో దాడి చేశాడు.

హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమోన్మాది కత్తిదాడిలో యువతి మృతి
Hyderabad Knife Attack

హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుగూడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి అంజలి మృతిచెందింది. ఆమెపై ప్రియుడు అశ్విన్ కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన అంజలి సోదరిపైనా దాడికి పాల్పడ్డాడు. అంజలిని, ఆమె సోదరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అంజలి మృతిచెందింది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సోదరికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం

ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 07:10 AM