Share News

జూబ్లీహిల్స్‌ ‘మాకొద్దు బాబోయ్‌’

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:40 AM

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యంత కీలకమైన, రాజకీయ-వీఐపీ ప్రాధాన్యమున్న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పోస్టింగ్‌ కోసం గతంలో పదుల సంఖ్య లో ఇన్‌స్పెక్టర్లు పోటీలు పడేవారు.

జూబ్లీహిల్స్‌ ‘మాకొద్దు బాబోయ్‌’
Jubilee Hills inspector posting

  • 20 రోజులుగా ఖాళీగా సీఐ పోస్టు

  • నెల రోజుల వ్యవధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యంత కీలకమైన, రాజకీయ-వీఐపీ ప్రాధాన్యమున్న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పోస్టింగ్‌ కోసం గతంలో పదుల సంఖ్య లో ఇన్‌స్పెక్టర్లు పోటీలు పడేవారు. ఉన్నతాధికారులతో పాటు ప్రముఖ నాయకులను ప్రసన్నం చేసుకొని మరీ పోస్టింగ్‌ సాధించేవారు. అలాంటి ఖరీదైన వీఐపీ జోన్‌ పోలీస్‏స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా రావడానికి ఇప్పుడు ఎవరూ సాహసించడం లేదని తెలుస్తోంది.


ఇటీవల నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సస్పెండ్‌ కావడం, నిత్యం ఏదో ఒక కేసు సంచలనంగా మారడం, వీఐపీ మూమెంట్‌ ఎక్కువగా ఉండటంతో ఆ పోస్టు ముళ్ల కిరీటాన్ని తలపిస్తుందని పలువురు సీఐలు భావిస్తున్నట్లు సమాచారం. దాంతో 20 రోజులుగా సమర్థవంతమైన ఇన్‌స్పెక్టర్‌ కోసం ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అటు పాలకుల మెప్పు, ఇటు బాసుల నమ్మకం.. ఈ రెండింటి సమతూకం కుదిరిన ఆల్‌ రౌండర్‌ దొరక్కపోవడంతో జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామకం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.


సమర్థతతో పాటు చతురత మస్ట్‌

జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో నిత్యం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, వీఐపీల కదలికలు ఉంటాయి. ఇక్కడ చిన్న ఘటన చోటు చేసుకున్నా అది రాష్ట్రస్థాయిలో సంచలనంగా మారుతుంది. అలాంటి చోట పూర్తి పదవీకాలం ప్రశాంతంగా పని చేయాలంటే కాఠిన్యమే కాదు, కాస్త రాజకీయ చతురత, పరిస్థితులను బట్టి స్పందించే చాకచక్యం ఉండాల్సిందే. గతంలో ఈ కిటుకు తెలిసిన కొందరు అధికారులు రెండు మూడేళ్ల పాటు దర్జాగా చక్రం తిప్పారు.


కానీ ఇటీవల మాత్రం తప్పటడుగులు వేస్తూ సస్పెన్షన్ల పాలవుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సస్పెన్షన్‌కు గురికావడం పోలీసు శాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా బాధ్యతలు చేపట్టిన ముత్తు యాదవ్‌ 25 రోజులకు, అంతకు ముందు శ్రీనివా్‌సరెడ్డి వ్యక్తిగత కారణాలతో సస్పెండ్‌ అయ్యారు.


మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో ఫిర్యాదుదారుడి విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ముత్తయాదవ్‌పై బదిలీ వేటు పడింది. ఆ సస్పెన్షన్‌ వేడి తగ్గకముందే.. రెండు రోజుల క్రితం హోటల్‌ దసపల్లాలోని ’కారా కారా‘ పబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యుడి సోదరుడి వర్గం రచ్చకెక్కడం స్థానికంగా మరోసారి ప్రకంపనలు సృష్టించింది. ఈ స్టేషన్‌ దాదాపు 20 రోజులుగా రెగ్యులర్‌ సీఐ లేకుండా గడవడం ఇదే మొదటిసారి.


ఈ వార్తలు కూడా చదవండి:

పాము విషానికి కొత్త విరుగుడు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 10:40 AM