Share News

మెహందీ పెట్టే వాళ్లకు కూడా ఇబ్బందేనా.. హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

ABN , Publish Date - Sep 11 , 2026 | 09:16 AM

పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక వేడుకల్లో చేతులకు అందమైన మెహందీ డిజైన్లు వేయడం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. ఇందుకోసం ప్రత్యేకంగా మెహందీ ఆర్టిస్టులను పిలుస్తుంటారు.

మెహందీ పెట్టే వాళ్లకు కూడా ఇబ్బందేనా.. హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో వైరల్
Mehendi Applying Machine

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక వేడుకల్లో చేతులకు అందమైన మెహందీ డిజైన్లు వేయడం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. ఇందుకోసం ప్రత్యేకంగా మెహందీ ఆర్టిస్టులను పిలుస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో షాక్ కలిగిస్తోంది. ఈ సాంప్రదాయ వృత్తిపై కూడా టెక్నాలజీ ప్రభావం చూపించబోతోందా? అనే చర్చకు తెరతీసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను షేర్ చేశారు (Harsh Goenka Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ తన చేతిని ఓ యంత్రంలో ఉంచింది. ఆ మెషీన్‌ ఆ మహిళ చేతిపై మెహందీ డిజైన్‌ను వేస్తున్నట్లు కనిపిస్తోంది. మనిషితో అవసరం లేకుండానే యంత్రం వేగంగా, కచ్చితంగా డిజైన్‌ను పూర్తి చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. హర్ష్ గోయెంకా 'మరికొన్ని ఉద్యోగాలు పోయాయి' అంటూ క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆటోమేషన్‌ ప్రభావం సాంప్రదాయ వృత్తులపై కూడా పడనుందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది (Mehendi Applying Machine).


హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు (Automation and Jobs). పెళ్లికి ముందు మహిళలు ఇలాంటి సూదుల కింద చేతిని పెట్టడానికి ఇష్టపడకపోవచ్చని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం చేతితో వేసే మెహందీకి ఉండే అందం, చిన్న చిన్న ప్రత్యేకతలను యంత్రం ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి యంత్రాల తయారీ, నిర్వహణ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు కూడా ఏర్పడవచ్చని కొందరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బ్రిక్స్‌ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 11 , 2026 | 09:16 AM