Share News

కొవ్వూరు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిన పలు రైళ్ల రాకపోకలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 09:34 AM

విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు - పశివేదల మధ్య శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

కొవ్వూరు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిన పలు రైళ్ల రాకపోకలు
Goods derail On kovvur to pasivedala railway track

రాజమండ్రి, సెప్టెంబర్ 11: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు - పశివేదల మధ్య శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం, విజయవాడ మధ్య పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై సమాచారం అందిన వెంటనే రైల్వే శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాక్‌పై నుంచి పట్టాలు తప్పిన గూడ్స్ రైలును తొలగించి.. రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.


ఫెర్టిలైజర్స్ లోడుతో ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఈ గూడ్స్ రైలు వెళ్తుంది. ఈ రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ మార్గంలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామర్లకోటలో విశాఖపట్నం నుంచి వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. అలాగే హౌరా నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును కూడా సామర్లకోటలో నిలిపి ఉంచారు.


విశాఖ, విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో రైళ్లు దాదాపు 8 గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో వైపు వరుస సెలవులు.. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయకచవితి వచ్చాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లేందుకు శుక్రవారం జనం సొంత ఊరు బాట పట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం

మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 10:25 AM