Share News

మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 11 , 2026 | 08:58 AM

ఏపీ మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.

మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్

అమరావతి, సెప్టెంబర్11: మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విషం కక్కడం బాధాకరమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ విమర్శలు తీవ్రతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కౌంటర్ ఇస్తూ శుక్రవారం నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా వీడియో విడుదల చేశారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.


డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా జగన్‌కు తెలుసా? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టుల సంఖ్య.. సున్నా అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారని ఆయన వివరించారు. ఈ డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు సుమారు 300 కేసులు వేశారంటూ వైసీపీ నేతలపై నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఈ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని కోర్టులు తప్పు పట్టలేదని పేర్కొన్నారు.


డీఎస్సీపై ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారని నారా లోకేశ్ చెప్పారు. టీచర్లపై ఒత్తిళ్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని 53 రోజులు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా సాగిన లీగల్ ప్రాసెస్ పూర్తయిందని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చిందని నారా లోకేశ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 09:59 AM