Share News

ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:54 PM

ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ మోసం చేసిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు.

ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో  భారీ మోసం
Free Launch Offer Scam

హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ మోసం చేసిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. 350 మంది నుంచి రూ.500 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బాధితులు ఈరోజు (బుధవారం) సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన పసుపులేటి సుధాకర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.


ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసపోయిన బాధితుల్లో ఎక్కువమంది బీడీఎల్ మాజీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు. మరో సంస్థకు భూమిని అమ్మకానికి పెట్టిందని త్రిపుర కంపెనీపై బాధితులు ఆరోపణలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు

‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 04:13 PM