Share News

బీఆర్ఎస్ అబద్దాలు చెప్పడం మానుకోవాలి: నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్

ABN , Publish Date - Nov 18 , 2026 | 07:18 PM

‘తెలంగాణ నదీ జలాల్లో చుక్క నీటి వాటాను కూడా వదులుకోం. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా వాడుకుంది. మేం వచ్చాకనే తెలంగాణ ఎక్కువ నీళ్లను వినియోగించుకుంటోంది. బీఆర్ఎస్ అబద్దాలు చెప్పడం మానేయాలి’ అంటూ నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ అబద్దాలు చెప్పడం మానుకోవాలి: నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్
uttam kumar reddy on brs

హైదరాబాద్, నవంబర్ 18: ‘తెలంగాణ నదీ జలాల్లో చుక్క నీటి వాటాను కూడా వదులుకోం. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా వాడుకుంది. మేం వచ్చాకనే తెలంగాణ ఎక్కువ నీళ్లను వినియోగించుకుంటోంది. బీఆర్ఎస్ అబద్దాలు చెప్పడం మానేయాలి’ అంటూ నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.


‘బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతోంది. కేటీఆర్ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్ర జల్ జీవన్ మంచి నీటి పథకం కింద ఏపీ.. 1.8 TMC లు తరలించే పనికి శ్రీకారం చుట్టింది. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిపై కేంద్రానికి, కేఆర్ఎమ్‌బీకి మా అభ్యంతరాలు చెప్పాం. ఆ పనులు ఆపించడానికి అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నాం. మేము మీలా ఏపీ పార్టీలు, నేతలతో లాలూచీ పడే వ్యక్తులం కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కృష్ణా జలాలను ఏపీయే ఎక్కువగా వినియోగించుకుంది. కృష్ణా నుంచి ఏపీ 4460 TMCలు తరలిస్తే తెలంగాణ 1993 TMCలు మాత్రమే వినియోగించుకుంది. మేం వచ్చాక ఏపీ 98.16 TMCలు తరలిస్తే.. తెలంగాణ 122.74 TMC వినియోగించుకుంది. ఏపీ కంటే తెలంగాణయే 24 TMC అధికంగా వినియోగించుకుంది. బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడం మానుకోవాలి’ అంటూ మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.


ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సోనియా ఆత్మకథపై కేటీఆర్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పారు.‘సోనియా గాంధీ లేకుండా తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ సోనియా గుండెల్లో ఉన్నందుకే రాష్ట్ర ఏర్పాటు జరిగింది. మీ పదవులు, ఆస్తులు, సంపద అంతా సోనియా తెలంగాణ ఇవ్వడం వల్లనే. అది మీ నాన్న అసెంబ్లీలో కూడా చెప్పారు’ అంటూ ఆక్షేపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

4.63 లక్షల మందికి పెన్షన్లు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 07:18 PM