Share News

కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాళేశ్వరం కట్టారు: మంత్రి ఉత్తమ్ కుమార్

ABN , Publish Date - Oct 24 , 2026 | 03:32 PM

కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాణహిత చేవెళ్లకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించాలనే తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్న బీఆర్ఎస్.. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాళేశ్వరం కట్టారు: మంత్రి ఉత్తమ్ కుమార్
uttam kumar reddy criticism on kcr

హైదరాబాద్, అక్టోబర్ 24: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ పార్టీ పదేపదే అబద్ధాలు చెబుతోందని నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి దుయ్యబట్టారు.


‘బీఆర్ఎస్ కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రాణహిత చేవెళ్ల నుంచి మేడిగడ్డకు మార్చారు. ప్రాజెక్ట్ వ్యయాన్ని 37వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచారు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ వాళ్ల హయాంలోనే కూలిపోయినా.. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరిట 2వేల కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని 20 వేల కోట్లకు పెంచారు. అధిక వ్యయంతో నిర్మించినా సరే.. కనీసం ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? జూరాల, దేవాదుల, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై ఉండేది కాదు. రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థను కేసీఆర్ అండ్ కంపెనీ సర్వ నాశనం చేసింది. అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్ల ముందు జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది’ అంటూ మంత్రి ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు.


ముఖ్యమంత్రి అసమర్థత వల్లే రాష్ట్రంలో కరవు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి అసమర్థత వల్లే రాష్ట్ర ప్రజలు తాగు, సాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద మండిపడ్డారు. ‘హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీరు లేక సతమతమవుతూ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ హయాంలో ట్యాంకర్ల అవసరం లేకుండా నీరు అందించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగు, తాగు నీరు అందించిన ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కేసీఆర్ హయాంలో లేని నీటి కొరత, కాంగ్రెస్ హయాంలో ఎలా ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి అసమర్థత, నీటి పారుదల వ్యవస్థలపై అవగాహణా రాహిత్యం వల్లనే నేడు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని ఎమ్మెల్యేలు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో జర జాగ్రత్త!

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 04:21 PM