Share News

సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:35 PM

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో యూఏఈ మంత్రి దావోస్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పని చేస్తామని యూఏఈ మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డితో యూఏఈ మంత్రి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్, జనవరి20(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో(CM Revanth Reddy) యూఏఈ మంత్రి దావోస్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేస్తామని యూఏఈ మంత్రి తెలిపారు. నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ ఉందని సీఎం తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే.. తెలంగాణ లక్ష్యమని వ్యాఖ్యానించారు. యూఏఈ– తెలంగాణ సంయుక్త టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదన చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


అలోన్ స్టోపెల్‌తో సీఎం భేటీ..

దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజు బిజీబిజీగా ఉంది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్‌తో సీఎం భేటీ అయ్యారు. సీఎంతో పాటూ మంత్రులు శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్‌ స్టార్టప్‌లకు సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌ టెక్, అగ్రిటెక్, సైబర్‌ సెక్యూరిటీ, ఎరో స్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకుంటుంది. ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.


తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలి: మంత్రి శ్రీధర్ బాబు

Sridharbabu.jpg

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలని గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా పదిశాతం లక్ష్యంగా విజన్ రోడ్‌మ్యాప్‌లో ఉందని తెలిపారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం– ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, ఏఐ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారీ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రోల్ మోడల్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పుకొచ్చారు. రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించినట్లు తెలిపారు. లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను దావోస్ వేదికగా ఆవిష్కరిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

హరీశ్‌రావును జైలుకు పంపాలని తహతహలాడుతున్నారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్

డైవర్షన్ కోసమే నోటీసులు.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 07:22 PM