ఆర్టీసీ గ్రేటర్ జోన్ విస్తరణ!
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:03 AM
ప్రయాణికుల పెంపే లక్ష్యంగా గ్రేటర్‌జోన్‌ను విస్తరించే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు చేపడుతోంది.
ప్రయాణికుల పెంపే లక్ష్యంగా చర్యలు
హైదరాబాద్ సిటీ: ప్రయాణికుల పెంపే లక్ష్యంగా గ్రేటర్‌జోన్‌ను విస్తరించే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది. కొత్త రూట్లలో బస్సులను నడిపేందుకు చర్యలు చేపడుతోంది. డిపోల వారీగా ఉన్న శివారు ప్రాంతాలు, ప్రయాణికుల సంఖ్య, ఎక్కువ మంది రాకపోకలు సాగించే మార్గాల వివరాలను సేకరించి రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులోకి తీసుకు రానుంది. గ్రేటర్‌జోన్‌లో 27 బస్సు డిపోల నుంచి 3,212 సిటీ బస్సులు రోజూ 32 వేల ట్రిప్పులు తిరుగుతూ ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.
క్రమంగా బస్సుల సంఖ్యతో పాటు ఆరునెలల్లో ట్రిప్పుల సంఖ్య 40 వేల వరకు పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 3,212 ఆర్టీసీ బస్సుల్లో రోజూ 26 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 18 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో ప్రయాణికుల ఆక్యుపెన్సీ వంద శాతానికి పెరిగింది. ఉదయం, సాయంత్రం రద్దీ రూట్లలో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
దీంతో రాబోయే రోజుల్లో కొత్త బస్సులు, డిపోలు తీసుకువచ్చే అవకాశాలను ఆర్టీసీ పరిశీలిస్తోంది. కొత్తగా జవహర్‌నగర్, బ్రహ్మన్‌పల్లిలో 2 బస్ డిపోలను ఏర్పాటు చేయనుంది. క్యూర్ పరిధిలో జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా గ్రేటర్ ఆర్టీసీ జోన్ స్వరూపం ఉండేలా రూట్‌మ్యా్‌పలు సిద్ధం చేస్తోంది. 2027 డిసెంబరు నాటికి క్యూర్ పరిధిలో కేవలం ఎలక్ర్టిక్ బస్సులు మాత్రమే నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News