Share News

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎంజీఎంఎస్ఎస్‌ ఆస్పత్రిగా నామకరణం

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:37 AM

వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పేరును రాష్ట్ర ప్రభుత్వం.. మహాత్మాగాంధీ మెమోరియల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (ఎంజీఎంఎస్ఎస్‌) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎంజీఎంఎస్ఎస్‌ ఆస్పత్రిగా నామకరణం

  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

వరంగల్‌ మెడికల్‌, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పేరును రాష్ట్ర ప్రభుత్వం.. మహాత్మాగాంధీ మెమోరియల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (ఎంజీఎంఎస్ఎస్‌) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తు ఈ నెల 23న జీవోఎంఎస్‌ నంబరు 180 జారీ చేశారు.


వరంగల్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి స్థాపన, నిర్మాణానికి జారీ చేసిన జీవోలను పరిశీలించిన సర్కారు.. దానికి ఎంజీఎంఎస్ఎస్‌ ఆస్పత్రిగా నామకరణం చేయాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌లను డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 06:37 AM