Share News

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:28 AM

‘సర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లను అక్రమంగా తొలగించడంపై ప్రజలు ఆందోళన చేస్తుంటే, దానికి మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ తెలంగాణకు వచ్చి పాదయాత్ర చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లను అక్రమంగా తొలగించడంపై ప్రజలు ఆందోళన చేస్తుంటే, దానికి మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ తెలంగాణకు వచ్చి పాదయాత్ర చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముందుగా కేంద్రంలో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


తమ వ్యతిరేక ఓట్లను తొలగించి తిరిగి అధికారంలోకి రావాలనే బీజేపీ కుట్రలో భాగమే సర్‌ అని, తెలంగాణలోనూ 92 లక్షలకు పైగా ఓట్లను బ్లాక్‌ లిస్టులో పెట్టారని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇంటర్మీడియట్‌ బోర్డును రద్దు చేసి 2030 నాటికి ఇంటర్‌ విద్యను దశలవారీగా పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని వెస్లీ అన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 06:28 AM