నేడు, రేపు తేలికపాటి వర్షాలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:34 AM
రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి జిలాల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం కూడా ఇంచుమించు ఇదే ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా సోమవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అత్యల్పంగా 15.1 డిగ్రీల రాత్రి పూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు 17.3 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News