ఆరనీకుమా ఈ దీపం..
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:52 AM
కార్తీక మా సంలో కనుల పండువ చేసే పౌర్ణమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకు నేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు.
నేడు కార్తీక పౌర్ణమి పర్వం
ఆలయాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
ఉసిరి చెట్ల వద్ద దీపోత్సవాలు
విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న క్షేత్రాలు
వరంగల్: కార్తీక మా సంలో కనుల పండువ చేసే పౌర్ణమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకు నేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. శివకేశవు లకు ఇష్టమైన ఈ మాసంలో జరుపుకునే ప్ర ధాన వేడుకల్లో పౌర్ణమి ఘట్టం ప్రత్యేకం. ప్ర తీ ఇంటా బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజా మునే లేచి ఉసిరిక స్నానాలు చేసి కార్తీక వొత్తులు వెలిగించుకుంటారు. అలాగే ఆలయా ల్లో కార్తీక దీపాలు వెలిగించి, ఉసిరిక దానా లు చేస్తారు. ఇంటింటా తులసి మాతను లక్ష్మీదేవిగా కొలుస్తూ కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ప్రతీ ఇంటా దీపావళి నుం చి మొదలైన కార్తీక దీపాలు పౌర్ణమి వేళ మరిన్ని ఎక్కువగా వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వాని స్తూ సుఖ సంతోషాల కోసం పూజించడం ఈ పర్వం విశిష్టత. కార్తీక దీపాల ద్వారా మనిషిలోని అజ్ఞానం తొలగి జ్ఞాన జ్యోతులు వె లుగుతాయన్నది భక్తుల విశ్వాసం.
పలు దేవాలయల్లో..
కార్తీక పౌర్ణమి వేళ హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాలగుడిలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. హనుమకొండలోని ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయం, ములుగు రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, దత్తక్షేత్రం, కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయం హనుమకొండలోని రాగన్న దర్వాజలోని శ్రీ సీతారామ ఆలయం, చిన్నకోవెల, ఎక్సైజ్ కాలనీలోని వేంకటేశ్వరాలయం, బాలసముద్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీల వారు ఏర్పాట్లు చేశారు.
కార్తీక పౌర్ణమి వేళ ములుగు రోడ్డులొని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పూజలతో పాటు శివాలయంలలో రుద్ర అభిషేకం నిర్వహిస్తున్నారు. సాయంత్రం అన్ని దేవాలయాలలో దీపోత్సవం నిర్వహిస్తారు. ఆంజనేయస్వామి వారికి చందనం, ఆకు పూజలు, పంచామృతం అభిషేకం, వడమాలలు, తమలపాకుల పూజ నిర్వహిస్తారు. ఇళ్లల్లో ఉసిరి కొమ్మ ఏర్పాటు చేసి పూజ చేస్తారు. శ్రీగౌరీ కేదారేశ్వర వ్రతం ఆచరించుకుంటారు. ఉసిరి కొమ్మ ఏర్పాటు చేసి నైవేద్యం పెడుతారు. ఉదయం.. సాయంత్రం.. ఇళ్లల్లో.. ఆలయాల్లో ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు. సాయంత్రం ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు. ఆలయాల్లో 365 వత్తులు కాలుస్తారు. కొందరు వన భోజనాలకు వెళ్తారు.
నగరంలో సందడి
కార్తీక పౌర్ణమి వేళ తులసి వద్ద భక్తితో వెలిగించే ఉసిరిక దీపాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉసిరి కొమ్మలతో తరలివచ్చిన అమ్మంకాదురులు, వినియోగదారులతో నగరమంతా సందడిగా మారింది. ప్రధాన వాణిజ్య కూడళ్లు హనుమకొండ, వరంగల్ చౌరస్తాలతో పాటు అనేక ప్రధాన కూడళ్ల వద్ద కూడా ఉసిరి కొమ్మలు, మామిడి ఆకులు, బంతి, చామంతి, గులాబీ పూల వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News