ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:36 AM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, నవంబర్ 24: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులు, వేధింపులకు గురిచేశాడంటూ మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణా రెడ్డిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా ఉదయ్ కృష్ణారెడ్డి కాగా, ఏ2 గా ప్రణయ్‌ను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను ట్యాంపర్ చేయడంలో ప్రణయ్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు.
ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం సమయంలో రాసిన సూసైడ్ నోట్‌ను ప్రణయ్ కృష్ణారెడ్డి దాచినట్లు విచారణలో బయటపడింది. అలాగే కీలక వీడియో ఆధారాలు కలిగిన మరో ఐఫోన్‌ను దాచడంలోనూ ప్రణయ్ రోల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏ2 గా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడిని పోలీసులు చేర్చారు. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా కోర్టులో ప్రణయ్ ముందస్తు బెయిల్‌ను పొందాడు.
ఇవి కూడా చదవండి...
పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..
కార్తీక పౌర్ణమి శోభ.. దేశవ్యాప్తంగా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు..
Read Latest Telangana News And Telugu News