Share News

కృష్ణా జలాలపై హరీశ్‌ది బూటకపు ప్రచారం

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:18 AM

కృష్ణా జలాలపైహరీశ్‌ రావు, బీఆర్‌ఎస్‌ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

కృష్ణా జలాలపై హరీశ్‌ది బూటకపు ప్రచారం

  • బీఆర్‌ఎస్‌ తప్పుడు నిర్ణయాలతోనే..

  • దక్షిణ తెలంగాణ రైతులకు నష్టం: చామల

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా జలాలపైహరీశ్‌ రావు, బీఆర్‌ఎస్‌ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం చేకూర్చాయన్నారు. ఈ ప్రాజెక్టుకు నీటి ఆధారాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చుతూ 2015లో ఆ ప్రభుత్వం జీవో 105ను విడుదల చేసిందని గుర్తుచేశారు. దీనివల్ల లిఫ్టులు, పంపులు పెరిగి.. రూ. 30 వేల కోట్లుగా ఉన్న అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లకు పైగా పెరిగిందన్నారు.


అయినా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. మరో వైపున ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. అప్పటి ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ విందు భేటీల తర్వాత ఏపీ ప్రభుత్వం 2020లో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ జీవోఇచ్చిందని గుర్తు చేశారు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌కు సంబంధించిన జీవో 56 కూడా 2022 ఫిబ్రవరి 16నే వచ్చిందన్నారు. ఈ విషయాలు కాగితాల మీద స్పష్టంగా ఉన్నా.. అవి ఇప్పుడే ప్రారంభమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 06:18 AM