Share News

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:41 AM

అక్రమ అండాల దందా కేసులో ఇద్దరు నిందితులను అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలంటూ మలక్‌పేట్‌ పోలీసులు 7వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

  • నిందితులు సద్గురు హెల్త్‌కేర్‌ నిర్వాహకులు

  • కోర్టులో మలక్‌పేట పోలీసుల పిటిషన్‌

నాంపల్లి కోర్టులు, నవంబర్‌ 24: అక్రమ అండాల దందా కేసులో ఇద్దరు నిందితులను అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలంటూ మలక్‌పేట్‌ పోలీసులు 7వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. మలక్‌పేట్‌లోని సద్గురు హెల్త్‌ కేర్‌ను నడుపుతున్న నిందితులు పసాల ఆనంద్‌రాజ్‌ (ఇన్‌ఛార్జి), సుభానీ షేక్‌ (అడ్మిన్‌)లను పూర్తి స్థాయిలో విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు.


వారిద్దరు అక్రమంగా అండాలను సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు లభించాయని, మరికొంత విచారణ జరపాల్సి తెలిపారు. దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఫిర్యాదుదారుడైన వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు తెలిపారు. మలక్‌పేట్‌లోని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ను సందర్శించి ఇద్దరు సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించినట్టు చెప్పారు. అక్కడి డోనర్‌ బుక్‌, విజిటర్‌ బుక్‌, శాంపిల్స్‌ ట్యాంక్‌ బుక్‌లను జప్తు చేసినట్టు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 06:41 AM