Share News

ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:29 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఓ కేఫ్‌లో 22 మహిళపై తోటి ఉద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో ఓ కేఫ్‌లో 22 మహిళపై తోటి ఉద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి, నిందితులు ఒకే కేఫ్‌లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి ప్రీత్ విహార్‌లోని సల్తనేట్ కేఫ్‌లో జరిగిన పార్టీకి హాజరైంది. రాత్రి 11.30 గంటలకు కేఫ్‌ను క్లోజ్ చేశారు. వారిలో ఒకరి వద్ద తాళం చెవి ఉండడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అందరూ మద్యం తాగుతూ, డ్యాన్స్ చేస్తూ పార్టీ కొనసాగించారు.


పార్టీ కొనసాగుతుండగా తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని, మిగతా వారు సహకరించారని బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్టీ జరిగిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 07:29 AM