Share News

రేపు షర్మిల కుమార్తె రిసెప్షన్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:31 AM

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి, సోమల రఘురామరెడ్డి వివాహ రిసెప్షన్‌ గురువారం రాత్రి చిక్కబళ్ళాపుర జిల్లా నంది హిల్స్‌లో జరగనుంది.

రేపు షర్మిల కుమార్తె రిసెప్షన్‌

  • నందిహిల్స్‌లోని ‘ఒర ఆకాశం’ రిసార్ట్‌లో

  • నేడు లీలాప్యాలెస్‌లో వివాహ వేడుక

బెంగళూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి, సోమల రఘురామరెడ్డి వివాహ రిసెప్షన్‌ గురువారం రాత్రి చిక్కబళ్ళాపుర జిల్లా నంది హిల్స్‌లో జరగనుంది. అక్కడి ‘ఒర ఆకాశం’ రిసార్ట్‌లో రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హాజరు కానున్నారు.

కాగా, అంజలిరెడ్డి వివాహం బుధవారం లీలాప్యాలెస్‌లో జరగనుంది. వాస్తవానికి యలహంకలోని ప్యాలెస్‌లో తన కుమార్తె వివాహం చేయాలని షర్మిల భావించారు. కానీ.. తన అన్న, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ ఆస్తి తన కుటుంబానికి చెందినదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాలెస్‌లోకి ప్రవేశించరాదని కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో షర్మిలతోపాటు ఆమె తల్లి విజయలక్ష్మి ప్యాలెస్‌కు వెళ్లేందుకు ఆదివారం ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు హెచ్‌ఏఎల్‌ రోడ్డులోని లీలాప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడే వివాహ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 05:35 AM