హైదరాబాద్‌లో కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. దీపాలు అంటుకుని మహిళ మృతి
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:49 PM
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో విషాదం ఘటన చోటుచేసుకుంది. కార్తీక దీపాలు వెలిగిస్తుండగా ఓ మహిళకు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో భానుమతి తీవ్రంగా గాయపడింది.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో విషాదం ఘటన చోటుచేసుకుంది. కార్తీక దీపాలు వెలిగిస్తుండగా ఓ మహిళకు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో భానుమతి (64) తీవ్రంగా గాయపడింది. హుటాహుటినా కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి ఆమెను తరలించారు.
ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భానుమతి మృతిచెందింది. ఈ ఘటనలో మంటల ధాటికి ఇంట్లోని సోఫా, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజు తీవ్ర విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News