ఫోన్ చూడొద్దని మందలించిన తల్లి.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ABN , Publish Date - Nov 21 , 2026 | 07:05 AM
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వివాహిత లక్ష్మీదేవి ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ చూడవద్దని ఆమె తల్లి మందలించడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిది నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం వాసిగా గుర్తించారు.
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నగరంలోని హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వివాహిత లక్ష్మీదేవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్ చూడవద్దని ఆమె తల్లి మందలించడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిది నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం వాసిగా గుర్తించారు. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి గదిలోకి వెళ్లి లక్ష్మీదేవి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి ఏడేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు ఉన్నారు. సమాచారం అందగానే హయత్‌నగర్ పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News