Share News

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..

ABN , Publish Date - Feb 26 , 2026 | 09:31 PM

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు.

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Restrictions

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ (Traffic Restrictions) మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు. రేపటి (శుక్రవారం) నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులలో భాగంగా శుక్రవారం నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్- 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. దీని కారణంగా ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, అవసరమైన చోట మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని గమనించాలని పేర్కొన్నారు.


ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపులు:

  • NFCL నుంచి వచ్చే ట్రాఫిక్: శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ -36- 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వారు.. శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవాలి. వీరు శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ -5, వెంకటగిరి ఎక్స్‌రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.

  • జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36- 45 నుంచి వచ్చే ట్రాఫిక్: NFCL వైపు వెళ్లే వారు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నెంబర్-2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.

  • KCP - బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -1 నుంచి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.

  • మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వారు: కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు.. విరించి హాస్పిటల్ (1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.


వాహనదారులకు సూచనలు:

  • సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో (ఉదయం 8:30 నుంచి11:00, సాయంత్రం 5:00 నుంచి 9:00) ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

  • ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్ బోర్డులను అనుసరించాలి.

  • తాజా ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్ (Google Maps మొదలైనవి) ఉపయోగించాలి.

  • ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజారవాణా లేదా కార్ పూలింగ్ (Car Pooling) కు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

  • తాజా సమాచారం కోసం మా సోషల్ మీడియా వేదికలు (Facebook: facebook.com/HYDTP, Twitter/X: @HYDTP) అనుసరించాలి. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయగలరు.

  • భాగ్యనగర పౌరులందరూ ఈ మళ్లింపులను గమనించి, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్

ఖర్గే‌ని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 09:54 PM