Share News

కేబీఆర్‌ పార్కు వద్ద నేటినుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 07:54 AM

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు ప్రవేశద్వారం, ముగ్ద జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు పరిధిలో స్టీల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కేబీఆర్‌ పార్కు వద్ద నేటినుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్: కేబీఆర్‌ పార్కు ప్రవేశద్వారం, ముగ్ద జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు పరిధిలో స్టీల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దారుల్లో వెళ్లేవారు ఆంక్షలు, మళ్లింపులను పరిగణనలోకి తీసుకుని ప్రయాణించాలని సూచించారు.


మళ్లింపులు ఇలా ..

  • నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు(Jubilee Hills Checkpost) మీదుగా వెళ్లే వాహనాలను శ్రీనగర్‌కాలనీ టి.జంక్షన్‌, సాగర్‌ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకొని శ్రీనగర్‌కాలనీ మెయిన్‌రోడ్డు మీదుగా ఇందిరానగర్‌ లేబర్‌ అడ్డా, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 5, వెంటగిరి క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లాలి.

  • జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36, 45 నుంచి ఎన్‌ఎఫ్‏సీఎల్‌ వెళ్లే వారు జుబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, వెంకటగిరి రోడ్డు నం.2, యూసు్‌ఫగూడ బస్తీ, యూసు్‌ఫగూడ చెక్‌పోస్టు, మైత్రివనం, అమీర్‌పేట మీదుగా లేదా ఇందిరానగర్‌ లేబర్‌ అడ్డా, శ్రీనగర్‌కాలనీ మీదుగా వెళ్లవచ్చు.


  • కేసీపీ గెస్ట్‌హౌస్‌, బంజారాహిల్స్‌ రోడ్డు నం.1 నుంచి కేబీఆర్‌ పార్కు, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనదారులు బంజారాహిల్స్‌ రోడ్డు నం.10 మీదుగా క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద ఎడమ వైపు తిరిగి, అగ్రసేన్‌ ఐలాండ్‌, భారతీయ విద్యాభవన్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వైపు వెళ్లవచ్చు.

  • మాసబ్‌ట్యాంక్‌ నుంచి వచ్చే వారు, కేబీఆర్‌ పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే వారు.. విరించి హాస్పిటల్‌ (1/12) వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్‌ ఐలాండ్‌, భారతీయ విద్యాభవన్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 45 వైపు వెళ్లవచ్చు.


city3.2.jpgవాహనదారులకు సూచనలు

  • రద్దీ సమయాల్లో (ఉదయం 8.30-11, సాయంత్రం 5-9 గంటల మధ్య) ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

  • ట్రాఫిక్‌ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్‌ బోర్డులను అనుసరించండి.

  • ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ కోసం నావిగేషన్‌ యాప్‌ను ఉపయోగించాలి.

  • ట్రఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్రజారవాణా లేదా కార్‌ పూలింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి.

  • రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.

  • మరింత సమాచారం కోసం హైల్ప్‌లైన్‌నంబర్‌ 9010203626కు కాల్‌ చేయవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

హమ్మయ్య! గోల్డ్ రేట్ తగ్గిందిగా!

మూడో డిస్కమ్‌ ఏర్పాటులో మరో కీలక అడుగు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2026 | 07:54 AM