Share News

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తుమ్మల భేటీ.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి కీలక వినతులు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:02 PM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ వ్యవసాయ, చేనేత, సహకార మంత్రిత్వ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు భేటీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి వినతిపత్రం అందజేశారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తుమ్మల భేటీ.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి కీలక వినతులు
kishan reddy, tummala meeting on problems in telangana

హైదరాబాద్, అక్టోబర్ 16: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ వ్యవసాయ, చేనేత, సహకార మంత్రిత్వ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు భేటీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.


ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో ఈ కింది అంశాలపై కేంద్రానికి వినతి పత్రం సమర్పించారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు మహానది బొగ్గును కేటాయించడం, రాష్ట్రానికి నిరంతర యూరియా సరఫరా చేయడం, ఆర్ఎఫ్‌సీఎల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.


సత్తుపల్లి బొగ్గు బ్లాక్-III ను సింగరేణికి కేటాయించాలని, భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటును వేగవంతం చేయాలని తుమ్మల కేంద్రానికి విన్నవించారు. దానితోపాటు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, పెనుబల్లి–కొండపల్లి, పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి వినతి పత్రం సమర్పించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ స్థానిక ఎన్నికలు.. ఆ మూడు పార్టీలకు ఉమ్మడి గుర్తుల కేటాయింపు

నామినేషన్ల వేళ వైసీపీ దౌర్జన్యాలపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 05:02 PM