Share News

నామినేషన్ల వేళ వైసీపీ దౌర్జన్యాలపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:25 PM

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడులకు దిగడంపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు.

నామినేషన్ల వేళ వైసీపీ దౌర్జన్యాలపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
Minister TG Bharat

కర్నూలు, అక్టోబర్ 16: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడులకు దిగడంపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ల సమయంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని ఆరోపించారు. పదవుల్లో లేకపోయినా వైసీపీ నేతల తీరు మారలేదని.. ఇప్పటికీ అదే దౌర్జన్యకర వైఖరంటూ విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ల సమయంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే మాటలు, గొడవలు సృష్టించడం వైసీపీ నేతల రాజకీయ శైలిగా మారిందన్నారు.


వైసీపీ నేతల వ్యవహారశైలిపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించాలని మంత్రి కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ఈసీ పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి భారీ మద్దతు ఇచ్చారని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపణలు గుప్పించారు. ప్రజలు వైసీపీ నేతల వ్యవహారశైలిని గమనించి, తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి టీజీ భరత్ కోరారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

ఏపీ స్థానిక ఎన్నికలు.. ఆ మూడు పార్టీలకు ఉమ్మడి గుర్తుల కేటాయింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 04:31 PM