ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:15 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలతోపాటు అందుకు సంబంధించిన ఆధారాలను ఏపీ పోలీసుల నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు.
అమరావతి, అక్టోబర్16: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వివరాలతోపాటు అందుకు సంబంధించిన ఆధారాలను ఏపీ పోలీసుల నుంచి ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. వీటి ఆధారంగా సోదాలు చేపట్టేందుకు ఆ అధికారులు సిద్ధమవుతున్నారు. 2025, ఏప్రిల్లో విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబర్10వ తేదీన మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో ఈ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జరిపినట్లు విమర్శలు వచ్చాయి.
ఈ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుతోపాటు మధుసూదన్ రావు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి బుద్ధి చెప్పనున్న ప్రజలు: ఎంపీ సానా సతీష్
ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. నేడు సాయంత్రంలోగా సరెండర్ లీవ్ నగదు జమ
For More AP News And Telugu News