ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. నేడు సాయంత్రంలోగా సరెండర్ లీవ్ నగదు జమ
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:28 PM
ఏపీ పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సరెండర్ లీవ్ ఎన్క్యాష్ మెంట్కు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించనున్నట్లు వెల్లడించింది.
అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం లోగా పోలీస్ ఉద్యోగస్థుల ఖాతాల్లో సరెండర్ లీవ్లకు సంబంధించిన నగదు జమ అవుతుందని వెల్లడించింది.
సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ అనగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక ఆర్థిక సంవత్సరంలో 15 రోజుల వరకు, లేదా రెండు సంవత్సరాలకు సంబంధించి 30 రోజుల వరకు ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం ద్వారా వాటిని నగదుగా మార్చుకోవచ్చు. కాగా.. పోలీసులకు సంబంధించిన ఈ సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్ నిధులు బకాయి పడగా.. వీటిని చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం లోగా పోలీసు ఉద్యోగస్థుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖాధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
Read Latest AP News And Telugu News